coins Bag



ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాల పెద్ద గొడవ ఐపోయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.
తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.
“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు.
అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”
వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు.
బీర్బల్ యెన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప సాగారు.
ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.
ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.
ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.
బీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

Related Posts :

  • Girl Friend 'ఇండియా ఇండియా ఇండియా' ఏముంది? ఇండియాలో? అంత పద్ధతీ, సంస్కృతీ కావాలనుకుంటే అక్కడే ఉండలేక పోయారా ? అపుడేమో మీ అవుసరానికి, సంపాదన కోసం డా… Read More...
  • vengalappa jokes ·      ఒక రోజు ఒక అందమైన అమ్మాయి, వెంగళప్పని, "ఐ లవ్ యూ..మనం పెళ్ళి చేసుకుందామా..??", అని అడిగింది. దానికి వె… Read More...
  • One Hug అబ్బబ్బా భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే కౌగిలింత మంత్రా బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చి… Read More...
  • Niharika Song Lyrics Oosaravelli Telugu నీహారిక నీహారిక నువ్వే నా దారిక నా దారిక నీహారిక నీహారిక నువ్వే నేనిక నీహారిక నీహార… Read More...
  • silence కొండ మీద నిల్చొని ఉన్నాడు రాంబాబు.పల్లె చాలా అందంగా కనబడుతోంది.అయితే పల్లెకు చెరో రెండు వైపులా అదేదో స్తంభంలా రెండు కట్టడాలు కనిపించ… Read More...