Mogali Puvvu Story

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వా?



పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!

Related Posts :

  • Girl Friend 'ఇండియా ఇండియా ఇండియా' ఏముంది? ఇండియాలో? అంత పద్ధతీ, సంస్కృతీ కావాలనుకుంటే అక్కడే ఉండలేక పోయారా ? అపుడేమో మీ అవుసరానికి, సంపాదన కోసం డా… Read More...
  • లీల మొదటి సారి తిరుపతి కి వచ్చింది-2 లీల మొదటి సారి తిరుపతి కి వచ్చింది...వాళ్ళది తూర్పు గోదావరి జిల్లా కావడంతో ఎప్పుడూ వాళ్ళు ద్వారకా తిరుమల కి వెళ్ళేవాళ్ళు...పెళ్లి అయ… Read More...
  • Niharika Song Lyrics Oosaravelli Telugu నీహారిక నీహారిక నువ్వే నా దారిక నా దారిక నీహారిక నీహారిక నువ్వే నేనిక నీహారిక నీహార… Read More...
  • మన రాత మన చేతల్లోనే మన రాత మన చేతల్లోనే -------------------------  చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒకాయన ఉండేవాడు. ఆయన సాధన బలం గొప్పది- అందువల్ల ఆయనకు… Read More...
  • silence కొండ మీద నిల్చొని ఉన్నాడు రాంబాబు.పల్లె చాలా అందంగా కనబడుతోంది.అయితే పల్లెకు చెరో రెండు వైపులా అదేదో స్తంభంలా రెండు కట్టడాలు కనిపించ… Read More...