Tiger Story



పులి చేతిలో గాజు

అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమయిపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒక రోజు నదీతీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది. ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టుకింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నొరూరింది. దెగ్గిరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసినవెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తనదెగ్గిరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది. “నీ దెగ్గిరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను” అన్నాడు మనిషి. “నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు – నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నయిపోయాను” అంది పులి. ఈ మాటవిని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దెగ్గిరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి
మీదకు దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగా దురాశ దు:ఖానికి చేటు.

Related Posts :

  • Sampurna ramayanam starting ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది. రామాయణం అందరికీ తెలుసు, కాకపోతె కొన్ని విషయాల్లో మనకి చాలా అపోహలు ఉన్నాయి, మనకి… Read More...
  • Telugu Weeks క్రమ సంఖ్య వారం పేరు ఆంగ్ల నామము 1 ఆదివారము Sunday 2 సోమవారము Monday 3 మంగళవారము Tuesday 4 బుధవారము Wednesday… Read More...
  • Loard Lakshi Devi గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం ఎలా అయ్యింది? మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం. లక్ష్మ… Read More...
  • Venkateswara Suprabhatam Telugu Lyrics ||ఓం|| కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవ మాన్హికం. ||1||(2 times) ఉత్తిష్ఠో ఉత్… Read More...
  • Lyrics for Jaya Janardhana Krishna Radhika song In Telugu జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,  నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.  జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,  నంద నందనా కృష్ణ ర… Read More...