vengalappa jokes


·      ఒక రోజు ఒక అందమైన అమ్మాయి, వెంగళప్పని, "ఐ లవ్ యూ..మనం పెళ్ళి చేసుకుందామా..??", అని అడిగింది. దానికి వెంగళప్ప, "అయ్యో..మనకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే మా కుటుంబంలో అందరూ బంధువులనే పెళ్ళి చేసుకుంటారు. ఉదాహరణకి, మా అమ్మ మా నాన్నని, మా అన్నయ్య మా వదినని, మా బాబాయి మా పిన్నిని పెళ్ళి చేసుకున్నారు..!!", అని సమాధానమిచ్చాడు.
·      వెంగళప్పకి డిటెక్టివ్ నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. కానీ, ఆ నవలలని మొదటి పేజీ నుండి కాకుండా మధ్యలో నుండి మొదలు పెట్టి చదివేవాడు. ఒకసారి వెంగళప్ప స్నేహితుడు, "ఏరా..ఎందుకని అట్లా చదువుతున్నావు..??" అని అడిగాడు. అప్పుడు, "మొదటి పేజీ నుండి చదివితే క్లైమాక్స్ ఒక్కటే సస్పెన్స్. కానీ మధ్యలో నుండి చదివితే క్లైమాక్స్ తో పాటు స్టార్టింగ్ కూడా సస్పెన్సే", అని చెప్పాడు వెంగళప్ప.
·      "కంగ్రాట్స్ వెంగళప్ప గారూ..మీరు ఒక మగబిడ్డకి తండ్రి అయ్యారు..", చెప్పింది నర్సు. "ఐతే..ఈ విషయం నా భార్యకి చెప్పి ఆమెని సర్ ప్రైస్ చేస్తాను", అన్నాడు వెంగళప్ప.
·      Psychotherapist మానస్ తన నేమ్ ప్లేట్ రాయమని వెంగళప్పకి చెప్పాడు. వెంగళప్ప ఇట్లా రాశాడు--డా. మానస్, psycho-the-rapist.
·      "భార్యకి, గడియారానికి తేడా ఏంటి..??", అడిగాడు వెంగళప్ప స్నేహితుడు. "గడియారం విప్పిన తరవాత పని చెయ్యడం ఆగిపోతుంది. కానీ, భార్య విప్పిన తరవాతే అసలు పని మొదలవుతుంది", చెప్పాడు వెంగళప్ప.
·      డాక్టర్ వెంగళప్పని అడిగాడు, మీదీ, మీ భార్యదీ బ్లడ్ గ్రూపు ఒకటేనా..??" "ఒకటే అయ్యి ఉంటుంది లెండి. పాతికేళ్ళ నుండి నా రక్తం తాగుతోంది", చెప్పాడు వెంగళప్ప.

·      "మీ కొట్లో కలర్ టీవీలు ఉన్నాయా?" అడిగాడు వెంగళప్ప. "ఉన్నాయి", సమాధానమిచ్చాడు కొట్టు యజమాని. "ఒక పసుపుపచ్చది ఇవ్వండి" అడిగాడు వెంగళప్ప.

·   ఒక రోజు వెంగలప్ప తన కొడుకు కాలేజీ కొరకు అతని ఫోటో తీసుకోని టౌన్ కు బస్సు లో బయలుదేరినాడు, ఆ బస్సు రద్దీ గా ఉన్నది . ఇంతలో కొడుకు ఫోటో చెయ్యి జారి కింద పడినది. ఆ ఫోటో ఒక మహిళ కాళ్ళ వద్ద పడినది. అప్పుడు వెంగలప్ప ఆ మహిళ తో , నువ్వు నీ చీరని పైకి లేపితే ఫోటో తీసుకుంటాను అన్నాడు. అది విన్న బస్సులోని వారందరూ వెంగలప్పను చావబాది హాస్పిటల్ లో చేరిపించినారు , అసలు వారు ఎందుకు కొట్టారో ఇప్పటికి మన వెంగలప్ప కి తెలియనేలేదు ?

·  ఒక రోజు వెంగలప్ప బస్సు ఎక్కి టౌన్ కు బయలుదేరినాడు , బస్సు లో డ్రైవర్ ప్రకన ఉండే సీట్ లో కూర్చున్నాడు . డ్రైవర్ చేసేపనిని విచిత్రంగా చూడసాగాడు ,వెంగలప్ప బస్సు నడపడం చూడడం ఇదే మొదటి సారి . మధ్యలో బస్సు ను భోజనాలకు ఆపి అందరు కిందకుదిగి హోటల్ లో భోజనాలు చేస్తున్నారు. కానీ మన వెంగలప్ప మాత్రం దిగలేదు. తరువాత అవ్దరు బస్సు ఎక్కినారు, డ్రైవర్ ఎక్కి చూస్తే గేర్ రాడ్ కనిపించలేదు, ఏమైందని వెతుకుతున్డగానే , మన వెంగలప్ప ఏదో సాధించిన వాడి లాగా డ్రైవర్ తో ఈ విధంగా అన్నాడు. ఏమి డ్రైవర్ వయ్య నువ్వు, నేను ఎక్కినకదినుంచి చూస్తున్నాను , ఆ రాడ్ ని పికలేకపోతున్నావు . అందుకే నువ్వు అన్నానికి వెళ్ళినప్పుడు పికిపెట్టాను , ఇదిగో నీ రాడ్ అని చెప్పాడు . అంతే మరల మన వెంగలప్ప హాస్పిటల్ లో చేరవలసి వచ్చినది.

Related Posts :

  • One Hug అబ్బబ్బా భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే కౌగిలింత మంత్రా బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చి… Read More...
  • Girl Friend 'ఇండియా ఇండియా ఇండియా' ఏముంది? ఇండియాలో? అంత పద్ధతీ, సంస్కృతీ కావాలనుకుంటే అక్కడే ఉండలేక పోయారా ? అపుడేమో మీ అవుసరానికి, సంపాదన కోసం డా… Read More...
  • vengalappa jokes ·      ఒక రోజు ఒక అందమైన అమ్మాయి, వెంగళప్పని, "ఐ లవ్ యూ..మనం పెళ్ళి చేసుకుందామా..??", అని అడిగింది. దానికి వె… Read More...
  • Niharika Song Lyrics Oosaravelli Telugu నీహారిక నీహారిక నువ్వే నా దారిక నా దారిక నీహారిక నీహారిక నువ్వే నేనిక నీహారిక నీహార… Read More...
  • silence కొండ మీద నిల్చొని ఉన్నాడు రాంబాబు.పల్లె చాలా అందంగా కనబడుతోంది.అయితే పల్లెకు చెరో రెండు వైపులా అదేదో స్తంభంలా రెండు కట్టడాలు కనిపించ… Read More...