భీమయ్య గారి తోటలోన చెట్ల మీద ఓక పక్షి గూడు కట్టుకుని అందులో పిల్లల్ని పెట్టింది. భీమయ్య ఓక రోజు కోడుకులతొ కలసి తొటకు వచ్చి అయ్యో చెట్లన్ని ఎండిపోయ్యయిరా! రేపు మన బందువులను తీసుకువచ్చి ఈ చేట్లు కొట్టేసి కొత్త మొక్కలు నాటుదాం అన్నాడు. పిల్లలకు ఆహరం తేవడానికి వెళ్ళిన తల్లి తిరిగి రాగానే పిల్లలు అమ్మా! ఈ రోజు తోట యజమాని భీమయ్య కొడుకులతో వచ్చి రేపు ఈ చేట్లు కొట్టేస్తారట అని చెప్పాయి. తల్లి పక్షి విని ఊరుకుంది.
మర్నాడు భీమయ్య తన కొడుకులతో వచ్చి రేపు కూలివాళ్ళను తీసుకువచ్చి ఈ చెట్లను కొట్టించేద్దాం అన్నాడు. తల్లి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఇదే విషయం చేప్పాయి. తల్లి విని ఊరుకుంది
మూడవ రోజు కూడ భీమయ్య తన కొడుకులతో వచ్చి ఎప్పటిలాగనే రేపు స్నేహితులతో వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నాడు.
ఎప్పటిలాగే తల్లి పక్షి విని ఊరుకుంది.
నాల్గవ రోజు కూడ భీమయ్య వచ్చి ఇక లాభం లేదురా రేపు మనమే వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నాడు.
తల్లి పక్షి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఆ విషయం చేప్పాయి. వెంటనే తల్లి పక్షి తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోయి ఇంకోక చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షులు అడిగాయి ఏందుకమ్మా మొదటిసారి, రెండవసారి, మూడవసారి, చెప్పిన పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలా తీసుకొచ్చావేంటి అని. అప్పుడు తల్లి పక్షి పిల్లలతో బందువుల మీద, స్నేహితుల, మీద కూలి వాళ్ళ మీద ఆదారపడితే పనులు అవ్వవు మన పనులు మనం చేసుకుంటే తప్పక అవుతాయి అంది
నీతి: మనం ఎప్పుటి పని అప్పుడు చేసుకొకుండా ఇతరులమీద ఆదారపడితే పనులు జరగవు. ఓకవేళ జరిగిన త్వరగా అవ్వవు...