sunny bunny jokes



వాస్తవానికి, భ్రమకి గల తేడా?
టీచర్: వాస్తవానికి, భ్రమకు ఒక ఉదాహరణ చెప్పరా సోము?
సోము: మీరు చెప్పడం వాస్తవం, మేము విన్నామనుకోవడం భ్రమ!
చీకటి యుగం ?
అప్పారావు: ఒరేయ్ సుబ్బారావు! మధ్యయుగాన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారెందుకు?
సుబ్బారావు: అప్పుడు కరెంటు లేదు కదరా.............!
అరటి పండు 
టీచర్: బాలు! అరటి పండు గురించి చెప్పు?
బాలు: తింటే బలపడతాం. తొక్కితే జారిపడతాం టీచర్!ఓ మై గాడ్ !
సోము: మా టీచర్ కి దైవభక్తి ఎక్కువ తెలుసా?
నాన్నా: నేను ఏ సమాధానం చెప్పినా 'ఓ మై గాడ్' అంటుంది నాన్నా...........!
అంత శ్రమెందుకు?పోస్టుమాన్: ఈ పార్సిల్ ఇవ్వడానికి 4 కిలో మీటర్ల దూరం నుంచి శ్రమపడి వస్తున్నాను తెలుసా?
అప్పారావు: అంత శ్రమెందుకు? పోస్ట్ చేస్తే సరిపోయేదిగా......................!
నువ్వే ఎక్కువ!
అప్పారావు: ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?
చింతామణి: నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!
మదర్ టంగ్నాన్నా: ఏంట్రా! మదర్ టంగ్ అన్న చోట 'లేదు' అని రాశావు?
రాజు: నువ్వేగా నాన్నా 'మీ అమ్మకు బొత్తిగా నోట్లో నాలుక లేదు' అంటుంటావు.........!
ఆ ఒక్క మార్కు?
చింతామణి: ఏమండీ పక్కింటి చింటు కి లెక్కల్లో 99 మార్కులొచ్చాయి తెలుసా?
చింతారావు: అవునా! ఆ ఒక్క మార్కు ఎక్కడికి పోయినట్తో?
చింతామణి: మన అబ్బాయికి వచ్చిందిగా!
ఎందుకు డాక్టర్?
డాక్టర్ : బిల్లు పేషంట్ చేతికి మాత్రం ఇవ్వకండి.
నర్సు: ఎందుకు డాక్టర్ ?
డాక్టర్ : ఇప్పటికే అతనికి రెండు సార్లు గుండెపోటు వచ్చింది .................!
మర్చిపోయాను నాన్నా!
నాన్నా: మీ స్కూల్లో నీ జ్ఞాపకశక్తి కి మెచ్చి ఇచ్చిన బహుమతి ఏది?
చింటు: ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నాన్నా!
ఇప్పుడేమి చేస్తున్నావురా?
మాష్టారు: చిన్నప్పుడు కాపీ కొట్టి పరీక్షలు రాసేవాడివి. ఇప్పుడేమి చేస్తున్నావురా సోము?
సోము: డబ్బింగ్ సినిమాలు తీస్తున్నాను మాష్టారు!
Take Your Seat!
అప్పారావు: ఎక్కడిదిరా ఈ కుర్చీ?
బాబూరావు : ఇంటర్వుకి వెళ్ళానండి. వాళ్ళు ' Take Your Seat' అన్నారు!
బాధపడుతున్నాం!
టీచర్: నన్ను వేరే ఊరికి బదిలీ చేశారురా!
పిల్లలు: అవునా టీచర్! చాలా బాధగా ఉంది టీచర్
టీచర్: నాకోసం బాధ పడుతున్నారా? నేనంటే మీకెంత అభిమానం .............
పిల్లలు: మీకోసం కాదు టీచర్, అక్కడి పిల్లల్ని తలచుకుని బాధపడుతున్నాం !
డ్రైవింగ్ జాగ్రతలేమిటిరా!
అప్పారావు: ఒరేయ్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు తీసుకునే జాగ్రతలేమిటిరా?
బాబురావు(డ్రైవర్): ముందు బండి మనది కాకుండా చూసుకోవాలి.
పంచదార చేదుగా ఎందుకు?
అప్పారావు: ఏమిటే పంచదార కాస్త చేదుగా ఉంది?
చింతామణి: ఏం లేదండి! పంచదారకి చీమలు పట్టాయని చీమలు మందు వేసా.
రెండో రంగు ఎక్కడ?
చింతామణి : డబుల్ కలర్ చీర అంటున్నారు.......ఒక రంగే కనిపిస్తోదేమిటి?
బాబురావు(salesman): ఉతికాక రెండో రంగు వస్తుంది!
ఇప్పుడేం చేస్తున్నావు?
అప్పారావు : ఏరా! నీ జాతకంలో రోజుకు వంద మందికి అన్నం పెట్టేంత వాడివి అవుతావని ఉందన్నావు కదా, ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?
సుబ్బారావు: హొటల్ లో సర్వర్........!
మోసపోయానురా?
అప్పారావు: కండక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుని మోసపోయానురా ............!
సుబ్బారావు: ఏమయ్యిందిరా?
అప్పారావు: సగం కట్నమే ఇచ్చి, మిగతాది వివాహ పత్రిక వెనుక రాసిచ్చాడురా............!