love story



ఒక ప్రేమకథ...
సువర్ణ... మొదటిసారి తన స్నేహితురాలు నీలిమ ఇంట్లో చూసిందతన్ని. అతను నీలిమ అన్నయ్యవాళ్ళ ఫ్రెండ్...విచిత్రమైన స్పందన... మనసుకేదో అయ్యింది. చాలా అందంగా ఉన్నాడు. తనను తాను అద్దంలో చూసుకుంది. తను అంత అందగత్తె కాదు. 
నలుపు... ముఖంలో అంత కాంతి కూడా లేదు. ఏ రకంగానూ... అతనిని ఆకర్షించలేదు. తన భావాలని తనలోనే దాచేసుకుంది. అతడు నీలిమ ఇంటికి తరచూ వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా... అతడిని తనివితీరా చూసుకునేది. కాని, అతనికి ఇవేవి తెలియదు. ఎప్పుడూ అతను తనను కన్నెత్తి కూడా చూడలేదు. అయినా తనలో అతనిపై ప్రేమ... ఇది నీలిమ గమనించింది. ఆమె హృదయం భగ్గుమంది... 
నీలిమకూడా అతన్ని ప్రేమిస్తొంది. అతను తన స్వంతం కావాలని కలలు కంటొంది. సువర్ణ అతనిపై ఆశపడటం... నీలిమకు నచ్చలేదు. తెలివిగా ఒకరోజు చెప్పింది. "తను, సాగర్ (అతను) ప్రేమించుకుంటున్నామని..." సువర్ణ... మౌనంగా ఉండిపోయింది. తన మూగప్రేమను తన హృదయంలోనే శాస్వతంగా సమాధి చేసుకుంది. క్రమంగా నీలిమ సువర్ణను దూరం చెయ్యసాగింది. అది అర్ధమైన సువర్ణ కూడా... 
నెమ్మదిగా నీలిమతో స్నేహాన్ని...తగ్గించింది. కొన్నాళ్ళకు, నీలిమకు వేరే ఎవరితోనో పెళ్ళి కుదిరిందని తెలిసి... 
సువర్ణ వెళ్ళీ నీలిమను పలకరించింది. "ఏం ఎందుకలా...?" అని. "ఏం చేయను...? అతను నన్ను ప్రేమిస్తున్నాడని బ్రమ పడ్డాను. తీరా అడిగితే, స్నేహితుడి చెల్లెలు... నాకూ చెల్లెలు అవుతుంది.నీమీద నాకు అలాంటి ఆలోచన లేదని చెప్పాడు" అంది. నీలిమ పెళ్ళయి వెళ్ళీపోయాక... 
సువర్ణకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు  ఉస్మానియాలో సీట్ వచ్చి హైదరాబాద్వె ళ్ళిపోయింది. ఆ తరువాత జాబ్... అలా పది సంవత్సరాలు గడచిపోయాయి. 
ఎందుకో సువర్ణకు వివాహం చేసుకోవాలని అనిపించలేదు. తన కుటుంబాన్ని పోషించుకుంటూ... అలాగే ఉండిపోయింది. కొన్నాళ్ళ తరువాత... 
ఒకరోజు తను రెంట్ కు ఉంటున్న ఇంటికి... రెండిళ్ళ అవతల... ఒకతన్ని చూసింది సువర్ణ... ఆమె కళ్ళల్లో... అతని ఒకప్పటి రూపం... అతనే...! పిల్లల్నిటూ వీలర్ పై ఎక్కించుకుని స్కూల్ కి తీసుకెళ్తున్నాడు. చాలా
ఆశ్చర్యపోయింది. సంతోషం కూడా కలిగింది. పెళ్ళయి సెటిల్ అయ్యాడన్న మాట...! ఒకసారి
పలకరించింది. అతను ముందుగా గుర్తుపట్టలేదు. ఆ తరువాత అన్నాడు. "సువర్ణగారూ... మీరు చాలా
మారిపోయారు. 
అప్పటికన్నా... ఇప్పుడు అందంగా ఉన్నారు." నవ్వింది సువర్ణ. ఇంట్లో
భార్యకు పరిచయం చేసాడు. ఇప్పుడిద్దరూ స్నేహంగా ఉన్నారు.
సువర్ణకోసం అతను తన కొలిగ్స్ లో సంభందాలు చూస్తున్నాడు.
సువర్ణ... నవ్వుకుంది.... ఒకప్పటి ప్రేమ ...
స్నేహంగా మారడం... విచిత్రమే కదా...!