Alibaba 40 Dongalu



నలభై దొంగలు

ముగ్గురు మగవారు ఒక బార్ లో తమ జీవితంలో కాకతాళీయంగా జరిగిన సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు.
మొదటివాడు చెప్పాడు, "నా భార్య రాముడు-భీముడు సినిమా చూసిన తరవాత కవలపిల్లల్ని కన్నది".
రెండో వాడు చెప్పాడు, "నా భార్య ముగ్గురు మొనగాళ్ళు సినిమా చూసిన తరవాత ముగ్గురు పిల్లల్ని కన్నది".
మూడో వాడు వెంటనే గాభరాగా లేచి, "అయ్యో..నేను ఇంటి దగ్గర బయల్దేరినప్పుడు నా భార్య ఆలీబాబా-నలభై దొంగలు సినిమా చూస్తుంది", అంటూ ఇంటికి పరిగెత్తాడు.

===============================================================


అబద్ధం

నలుగురు పిల్లలు ఒక్క గాలిపటం కోసం కొట్లాడుకుంటున్నారు. కొంతసేపటికి తమలో తాము ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరు పెద్ద అబద్ధం ఆడితే వాళ్ళకి ఆ బొమ్మ ఇవ్వాలని నిర్ణయించారు. వీళ్ళ మాటలు దూరం నుండి వింటున్న ఒక సన్యాసి దగ్గరగా వచ్చి, "చూడండి పిల్లలూ..ఇలా అబద్ధాలు ఆడటం చాలా తప్పు. పాపం తగులుతుంది. నేను మీ అంత ఉన్నప్పుడు అసలు అబద్ధాలే ఆడలేదు తెలుసా..??", అన్నాడు. వెంటనే పిల్లలందర్లోకీ కొంచెం పెద్దవాడైన బాబి గాడు అరిచాడు, "ఒరేయ్..ఆ బొమ్మ ఈ సన్యాసికి ఇచ్చేద్దాం. ఈయనే పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతున్నాడు".