College



కాలేజ్
వాళ్ళ అబ్బాయిని ఏ కాలేజ్ లో చేర్చాలా అని ఒక తండ్రి ఒక కార్పొరేట్ కాలేజ్ వాచ్ మెన్ ని ఎంక్వైరీ చేస్తున్నాడు.
"బాబూ..!! ఈ కాలేజ్ మంచిదేనా..??"

వాచ్ మెన్ అన్నాడు, "చాలా మంచిదండి. ఇక్కడ చదివిన వెంటనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. నేను ఈ కాలేజ్ లోనే చదివి, వెంటనే ఈ ఉద్యోగం సంపాదించగలిగాను".
================================================================
పని విభజన
మేనేజ్ మెంట్ సూత్రాలలో పని విభజన అనే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. దాని ప్రకారం, ప్రతి పనినీ ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని ఆ సంస్థలో పని చేసే ఒక్కొక్క ఉద్యోగికి ఇచ్చి చెయ్యమంటారు. దీని వల్ల సమయం వృధా కాకుండా పని వేగంగా పూర్తి అవుతుందని మేనేజర్ల వాదన. కానీ దీని వల్ల ఉద్యోగుల ఆలోచనాశక్తికి పని లేకుండా పోతుందని విమర్శ. దాని గురించే ఈ జోకు.

ఒక మునిసిపాలిటీ ఉద్యోగి రోడ్డు పక్కన ఐదు మీటర్లకి ఒక గుంట చొప్పున గుంటలు తవ్వుతూ వెళ్తున్నాడు. ఆ వెనుక ఒక ఉద్యోగి వాటిని పూడ్చేస్తూ వస్తున్నాడు. ఇద్దరూ చెమట్లు కక్కుతున్నారు. వీళ్ళ శ్రమ చూస్తున్న దారిన పోతున్న ఒక పెద్దమనిషి, "ఏమిటయ్యా..ఈ గుంటలు ఎందుకు తీస్తున్నారు..?? మళ్ళీ వెంటనే ఎందుకు పూడ్చేస్తున్నారు..?? ఇంత కష్టపడి పని దండగ చేస్తున్నారేంటయ్యా..??", అని అడిగాడు. దానికి, "ఏం లేదు బాబుగారూ..వీడి పని గుంటలు తవ్వడం, నా పని గుంటలు పూడ్చడం, ఈ గుంటల్లో మొక్కలు నాటవలసినవాడు ఈ రోజు సెలవు పెట్టాడు" చెప్పాడు గుంటలు పూడుస్తున్నవాడు గుంటలు పూడ్చడం ఆపకుండానే.