Niharika Song Lyrics Oosaravelli Telugu



నీహారిక నీహారిక నువ్వే నా దారిక నా దారిక
నీహారిక నీహారిక నువ్వే నేనిక
నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నీహారిక నీహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే
నీపై ఇష్తమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంతానంటే
నాకై ఇన్ని చేయాలనీ నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే

రెండు రెప్పలు మూతపడవుగా
నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా
నువ్వు దూరమైతే
రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా
నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింక
వదులుకోను చెయ్యందుకో

నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయ తీయగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా
హాయిగానే ఉంది
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్టు
మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలవుతున్నా కొత్త మాటలింకెన్నో
గుర్తుకొచ్చేనే వింతగా